Header Banner

సినీ ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ కలకలం! హోటల్ పై రైడ్! మూడో అంతస్తు నుంచి దూకి హీరో పరార్!

  Thu Apr 17, 2025 19:14        Others

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వాలు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఫలితాలు కనిపించడంలేదు. ముఖ్యంగా నైట్‌ క్లబ్బులు, ప్రైవేట్ పార్టీలు డ్రగ్స్ వినియోగానికి హబ్‌లుగా మారాయి. తాజాగా, కొచ్చిలోని ఓ ప్రముఖ హోటల్లో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు హోటల్‌పై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, హోటల్ మూడో అంతస్తు నుంచి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి పోలీసుల కంటిని తప్పించుకున్నాడు. ఈ దృశ్యం సీసీటీవీలో రికార్డవగా, ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

 

ఇదే సందర్భంలో, షైన్ టామ్ చాకోపై మళ్లీ గత ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్, అతను డ్రగ్స్ తీసుకుని తనను మానసికంగా హింసించాడని, తన ముందే బట్టలు మార్చుకోవాలని ఒత్తిడి చేసేవాడని గతంలో ఆరోపించింది. షైన్ పై తాజాగా నమోదైన డ్రగ్స్ కేసు నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు మళ్లీ వైరల్ కావడం గమనార్హం. నటుడిగా షైన్ టామ్ చాకో తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో తనదైన శైలిలో పేరు తెచ్చుకున్నాడు. నాని నటించిన 'దసరా' చిత్రంలో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. అలాగే రంగబలి, దేవర, దాకు మహారాజ్, రాబిన్ హుడ్ వంటి చిత్రాల్లో కూడా కనిపించాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్న అతను, డ్రగ్స్ కేసుతో మరోసారి వార్తల్లో నిలిచాడు.

 

ఇది కూడా చదవండివైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ShineTomChacko #DrugsRaid #KochiHotelRaid #DrugAbuseInCinema #ShineTomChackoControversy